ఈనెల 27న తితిదే బోర్డు కీలక సమావేశం

వాస్తవం ప్రతినిధి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం ఈనెల 27న తిరుమలలోని అన్నమయ్య భవన్‌‌లో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గత ఏడాది మార్చి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరిగి జూన్ నుంచి దర్శనాలను మొదలు పెట్టినప్పటికీ ఆర్జిత సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి ఆర్జిత సేవలను ప్రారంభించే అంశంతో పాటు భక్తుల సంఖ్యను పెంచే అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.