దుర్గ గుడిలో వెలుగుచూసిన అవినీతి..13మంది ఉద్యోగుల సస్పెన్షన్

వాస్తవం ప్రతినిధి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన ప్రఖ్యాత కనకదుర్మమ్మ ఆలయంలో గత మూడు రోజులుగా ఏసీబీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే కాగా..ఈ నేపధ్యంలో పలు కీలక పత్రాలను అవినీతి ఆధారాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వగా భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో పనిచేసే 13మంది ఉద్యోగుల్ని సస్పెన్షన్కు ఆశాఖ కమిషనర్ కీలక ఆదేశాలు జారీచేశారు. వీరిలో ఐదుమంది సూపరింటెండెంట్ స్థాయి సిబ్బంది కూడా ఉండటం గమనార్హం.

అన్నదానం టిక్కెట్ల అమ్మకాలు చీరల విభాగాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు. గుడి భూములు షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం దర్శనాల టికెట్ల అమ్మకం అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది.