వాస్తవం ప్రతినిధి: ములుగు జిల్లా ఏజెన్సీ వాజేడు మండలం లో పులి సంచారంతో గిరిజనులు హడలిపోతున్నారు.. నేటి ఉదయం కొంగల జలపాతం సమీప అడవిలో చెట్టుపై పులి ఉండటంతో కొందరు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు..ఈ పులి ఉన్న ప్రాంతానికి రెండు కిలో మీటర్ల దూరంలో కొంగల గ్రామం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.. వెంటనే పులిని పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.