బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ వ్యాల్యూ లక్ష కోట్ల డాలర్లు

వాస్తవం ప్రతినిధి: బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ వ్యాల్యూ ఏకంగా లక్ష కోట్ల డాలర్లు దాటింది. ఒక బిట్‌ కాయిన్‌ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా 56,620 డాలర్లను క్రాస్‌ చేసింది. దీంతో క్రిఎ్టో కరెన్సీ మార్కెట్‌ వ్యాల్యూ ఆల్‌ టైమ్‌ గరిష్ఠాన్ని తాకింది. 2 నెలలుగా బిట్‌ కాయిన్‌ వ్యాల్యూ అంతకంతకూ.. పెరుగుతోంది. ఈ వారమే 18 శాతం లాభపడింది. ఈ సంవత్సరం 92 శాతం ఎగిసింది. శనివారం క్రిఎ్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ వ్యాల్యూ లక్ష కోట్లు లేదా రూ.72.73 లక్షలకోట్లు దాటింది. శుక్రవారం ఆల్‌టైంగరిష్ఠం 55వేల డాలర్లకు చేరుకున్న బిట్‌ కాయిన్‌.. మరుసటి రోజే.. 56వేల డాలర్లు దాటింది. 18.6 మి.డాలర్ల కాయిన్స్‌ సర్క్యూలేషన్‌లో ఉన్నాయి.