చిరు స‌ర్‌ప్రైజ్‌కు కృతి గాలిలో తేలిపోతోందట!

వాస్తవం సినిమా: వింటేజ్ ప్రేమ క‌థా చిత్రంగా తెర‌కెక్కి ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకున్న చిత్రం ఉప్పెన‌. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాక విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం ఈ మూవీ స్పెష‌ల్ షో వేయించుకొని మ‌రీ చూశారు. వైష్ణ‌వ్ తేజ్ న‌ట‌న‌తో పాటు కృతి శెట్టి న‌ట‌న‌ను అప్రిషియేట్ చేశారు. బేబ‌మ్మ‌గా కృతి అభిన‌యం అద‌రిందని పొగ‌డ్త‌లు కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమె న‌ట‌నపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. భవిష్య‌త్‌లో మంచి హీరోయిన్‌గా మారుతుంద‌ని అన్నారు. అయితే ఉప్పెన స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో చిత్ర బృందానికి ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తున్న చిరు తాజాగా కృతి శెట్టికి లేఖ రాసి పంపార‌ట‌.

చిరుపంపిన లేఖ‌ను ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన కృతి చాలా సంతోషించింది. లేఖ‌లో పువ్వు పుట్ట‌గ‌నే ప‌రిమ‌ళిస్తుంద‌ని అన్న దానికి నువ్వొక ఉదాహర‌ణ‌. భాష తెలియ‌క పోయిననా వారంలో నేర్చుకొని పాత్ర‌లో జీవించావు. నువ్వొక అద్భ‌తానివి. ఉప్పెన ఇంతటి ఘ‌న విజ‌యాన్ని సాధించినందుకు నీకు అభినంద‌న‌లు చెబుతున్నా . ఈ బేబ‌మ్మ‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకున్నారు. నువ్వు ఇలాగే మంచి విజ‌యాల‌ను అందుకుంటూ కెరీర్‌ని కొన‌సాగిస్తావ‌ని భావిస్తున్నా అని చిరు లేఖ‌లో పేర్కొన్నారు. అయితే చిరు స‌ర్‌ప్రైజ్‌కు కృతి గాలిలో తేలిపోతుంది.