సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్న ప్రభాస్ నయా లుక్

వాస్తవం సినిమా: ఇండియా మొత్తం ఉన్న అగ్ర హీరోల్లో అందరికంటే ఎక్కువ సినిమాలను లైన్ లో పెట్టిన ఏకైక హీరో మన ప్రభాస్. సాహో సినిమా త‌ర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు సినిమాల్లో న‌టిస్తూ తీర‌క లేకుండా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న న‌టిస్తోన్న‌ రాధేశ్యామ్ సినిమా లుక్‌, టీజ‌ర్ విడుద‌లైంది. అందులో ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్ లుక్‌లో క‌న‌ప‌డుతూ అల‌రించాడు. ఇంకా ఆయ‌న చేతిలో సలార్, ఆదిపురుష్ సినిమాలూ ఉన్నాయి.

అయితే, ప్రభాస్ కొత్త‌ లుక్ ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది. సామాజిక మాధ్య‌మాల్లో ఇది విప‌రీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ప్ర‌భాస్‌ కోర మీసాలతో, క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఉన్నాడు. ప్ర‌భాస్ ఇలా కొత్త లుక్‌లో ఎందుకు క‌న‌ప‌డుతున్నాడ‌న్న చ‌ర్చ కొన‌సాగుతోంది. ప్రభాస్ ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రాముడిగా కనిపించాలి అంటే ఫిట్నెస్ చాలా అవసరమని అలాగే సిక్స్ ప్యాక్ కూడా మరోసారి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి.

ఆయ‌న న‌టిస్తోన్న ఆదిపురుష్ సినిమాలోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ ఇలా మీసాలు పెంచాడని కొంద‌రు భావిస్తున్నారు. ఆయ‌న పాత లుక్‌లను కొత్త లుక్‌తో పోల్చుతూ అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.