ముంబైలోని ఓ హోటల్‌లో లోక్‌సభ ఎంపీ అనుమానాస్పద మృతి

వాస్తవం ప్రతినిధి: ముంబైలో లోక్‌సభ ఎంపీ మోహన్‌డెల్కర్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు. ముంబైలోని ఓ హోటల్‌లో డెల్కర్‌ మృతదేహం లభించింది. దాద్రానగర్‌ హవేలీ నుంచి మోహన్‌డెల్కర్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోహన్‌డెల్కర్‌ మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోహన్‌డెల్కర్‌ మృతిపై పలు కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. డెల్కర్‌ మృతితో అభిమానులు కార్యకర్తలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.