వాస్తవం ప్రతినిధి: ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరుగుతున్నది. దేశ వ్యాప్తంగా కొత్తకేసులు కలవరం సృష్టిస్తున్నాయి. కేరళ – మహారాష్ట్ర – పంజాబ్ – మధ్యప్రదేశ్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ – కఠిన నిబంధనలు కూడా విధిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదయిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కేరళ ఉంది. ప్రస్తుతం అక్కడ 60వేల యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో ఇవి 42 శాతం.
శుక్రవారం దేశవ్యాప్తంగా 14 వేల కేసులు నమోదయ్యాయి. 101 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 16న 9121 కేసులు – ఫిబ్రవరి 17న 11610 కేసులు ఫిబ్రవరి 18న 12881 – ఫిబ్రవరి 19న 13193 – ఫిబ్రవరి 20న 13993 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార వర్గాల్లో ఆందోళన నెలకొన్నది.