చిదంబరం ,కార్తీ చిదంబరంలకు సుప్రీంకోర్టులో ఊరట

వాస్తవం ప్రతినిధి: కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసింది. రూ. 2 కోట్లను కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రూ. 305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ కేసులో 22 రోజుల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో కార్తీ చిదంబరం గడిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.