తలైవా తో కమల్ భేటీ..తమిళ రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపు !

వాస్తవం ప్రతినిధి: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో తమిళ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నాయి. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన వేగం పెంచారు. ఇటివలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఫోన్లో మాట్లాడి పొత్తు పెట్టుకున్న కమల్ ఇప్పుడు మరో ముందడుగు వేశారు. ప్రముఖ నటుడు రజినీకాంత్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వీరిద్దరూ సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ వెల్లడించారు.