ఏపీలో కొనసాగుతున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

వాస్తవం ప్రతినిధి: ఏపీలో నేడు చివరిదైన నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్లలో 161 మండలాల ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు. 2,743 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 66.60 శాతం ఓటింగ్ నమోదైంది.

విశాఖ జిల్లాలో 73.30 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 64.04 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 63.39, కృష్ణా జిల్లాలో 62.82, గుంటూరు జిల్లాలో 62.87, ప్రకాశం జిల్లాలో 61.79, నెల్లూరు జిల్లాలో 61.62, చిత్తూరు జిల్లాలో 66.62, కడప జిల్లాలో 69.93, కర్నూలు జిల్లాలో 68.62, అనంతపురం జిల్లాలో 71.65 శాతం పోలింగ్ జరిగింది.

పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది.