భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ..సర్వం సిద్దం

వాస్తవం ప్రతినిధి: ఫిబ్రవరి 24వ తేదీన భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. మూడో టెస్ట్ మ్యాచ్ ‌ను గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో గల సర్ధార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ కోసం నిర్వాహకులు గ్రీన్‌ పిచ్ ‌ను సిద్ధం చేశారు. ఈ గ్రీన్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు కాస్త సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మూడో టెస్ట్‌ లో తమ బౌలింగ్‌ తో విజృంభించి భారత్‌ ను మట్టికరిపించాలని భావిస్తోంది.

ప్రస్తుతం సర్ధార్ పటేట్ స్టేడియం పిచ్ పచ్చగా కనువిందు చేస్తున్నప్పటికీ.. మ్యాచ్ జరగానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ 4 రోజుల్లో వాతావరణ ప్రభావం పిచ్‌ పై పడే అవకాశం ఉందని, ఫలితంగా పిచ్‌ పై పగళ్లు వస్తే స్పిన్‌ కు అనుకూలంగా మార్చే ఛాన్స్ లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అదే గనుక జరిగితే మూడవ టెస్ట్ మ్యాచ్ ‌లోనూ టీమిండియా విజయం సాధిస్తుంది.