ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధాని మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 6 వ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి పాల్గొన్నారు.

రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల గురించి చర్చించడంతో పాటు ఆర్ధిక పరమైన ఇబ్బందులను గురించి సీఎం లతో ప్రధాని మోడీ చర్చించారు. ఈ సమావేశంలో మరో సారి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీని అడిగారు.

రాష్ట్రం కష్టాల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ సమయంలో రాష్ట్రం ను ఆదుకోలేరు అంటూ విజ్ఞప్తి చేశాడు. విభజన కారణంగా చాలా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా మినహా మరే మార్గం లేదని జగన్ అన్నారు. తయారీ రంగంలో ఉన్న భారీ పన్నుల కారణంగా కొత్త కంపెనీలు పెట్టుబడులకు రావడం లేదు. అందుకే ప్రత్యేక హోదా విషయమై మరోసారి ప్రధానిని సీఎం జగన్‌ అడిగారు. పంటల ఉత్పత్తికి ఖర్చులు తగ్గించడంతో పాటు తక్కువ రేటుకు ఎరువులు మరియు పురుగు మందులు తక్కువ రేటుకు వచ్చేలా చేయాలని కూడా జగన్‌ ఈ సందర్బంగా మోడీకి సూచించారు.