ఉయ్యూరు పట్టణంలో మెడికల్ మరియు ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజీ లు నూతనంగా స్థాపించాలి: బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి: ఉయ్యూరు పట్టణంలో మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజీ లు నూతనంగా స్థాపించాలని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేసారు.

ఉయ్యురు పట్టణంలో మెడికల్ కాలేజీ ని మరియు ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజీ లను స్థాపించాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గారు కే.సి.పీ C.O.O శ్రీ జి. వెంకటేశ్వరావు గారికి వినతి పత్రము ఇచ్చారు.

ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ మీ కే.సి.పీ షుగర్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మా ఉయ్యురు పట్టణం లో నూతనం గా ఒక మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజీ లను స్థాపించి, నిర్మించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామని, అందుకు కావలిసిన పూర్తి సహాయ, సహకారాలను నేను, మా ఉయ్యురు ప్రజలు, ఇతర నాయకులు అందించగలమని, శ్రీ వెంకటేశ్వరావు గారికి రాజేంద్రప్రసాద్ గారు హామీ ఇచ్చారు.

అలాగే ఆ మెడికల్ కాలేజీ మరియు ఇంజినీరింగ్ కాలేజీ అండ్ పాలిటెక్నిక్ కాలేజీ లు స్థాపించుటకు తగిన వాతావరణం, డిమాండ్, స్టామినా మా ఉయ్యూరు పట్టణంకు ఉన్నది. మరియు ఆ కాలేజీ లు స్థాపించుట వలన మా ఉయ్యూరు ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం, నిపుణులు అయిన సీనియర్ డాక్టర్ ల ఆధ్వర్యంలో 24 గంటలు ( రాత్రులు కూడా) అందుతుందని, అలాగే మా ఉయ్యూరు ప్రజలు పలు రకాలుగా లబ్ద్ధి పొందుతారని, ఉయ్యురు లోని యువతి, యువకులకు ఉద్యోగాలు వస్తాయని, ఉయ్యూరు పట్టణం అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం తోనే నేను మీకీ విజ్ఞప్తిని స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీకే వివరించి చేయుచున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.

అలాగే మీరు కూడా ఉయ్యూరు పట్టణంలోనే గత 25 సంవత్సరాలు గా మాలో ఒక్కరిగా ఉంటూ, అనేక రకాల సేవా కార్యక్రమాలు మా ఉయ్యూరు ప్రజలకి అందిస్తున్నారని , అదే విధంగా మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్, పాలిటెక్నీక్ కాలేజీలు మీ కేసీపీ సంస్థ వారి ఆధ్వర్యంలో స్థాపించి మా ఉయ్యూరు పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా మీరు, మీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

C.O.O వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ గారి ఆలోచన చాలా ఉన్నతమైనదని, దీని వలన ఉయ్యూరు పట్టణ దశ, దిశ మారి అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుందని, తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి విజ్ఞప్తి మా యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లి నా వంతుగా ఈ కాలేజీ ల ఏర్పాటు అయ్యేవిధంగా కృషి చేస్తానని అన్నారు.

మా విజ్ఞప్తి మన్నించి కాలేజీ ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన వెంకటేశ్వరావు గారికి రాజేంద్రప్రసాద్ గారు మరియు స్థానిక నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కూనపరెడ్డి వాసు, చిరంజీవి, ప్రవీణ్, శ్రీనివాస్, రఫీ, నరేష్, పలియాల శ్రీను, కరీం బేగ్, భాస్కర్, నరేంద్ర, సల్మాన్, సుబ్బారావు, అయ్యప్ప, నజీర్ అంజి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.