ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరున్నరకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగింది.

మొత్తంగా చూస్తే మూడో విడతలో 2వేల639 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరగుతోంది. ఇది మరికాసేపట్లో నేతల భవితవ్యం తేలనుంది. మూడో విడతలో జరుగుతున్న స్థానాల్లో 7వేల757 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 160 మండలాల్లోని 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ మొదలై మధ్యాహ్నాం 3.30 గంటలకు ముగిసింది.

ఇక మూడో విడతలో 3,321 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్‌ జారీ కాగా, అందులో 579 సర్పంచ్‌ పదవులకు ఎన్నికగ్రీవమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లో అధికార వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది.