ఇంగ్లాండ్‌ తో రెండో టెస్టులో భారత జట్టు విజయం

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై పోరులో చెపాక్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్‌ 5/60, అశ్విన్‌ 3/53 మరోసారి చెలరేగడంతో భారత్‌..‌ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అనుకూలంగా ఉంటూ బ్యాటింగ్‌కు కష్టమైన సమయంలో అశ్విన్‌ సెంచరీతో రాణించగా.. కీలక సమయంలో అద్భుత ప్రదర్శనతో సెంచరీ సాధించిన అతను రెండో టెస్టును పూర్తిగా టీమిండియా చేతుల్లోకి తీసుకుని వచ్చాడు. అహ్మదాబాద్‌లో జరిగే ‘పింక్‌ టెస్టు’కు ముందు టెస్టు సిరీస్‌ 1–1తో సమం చేసి జోష్‌లో ఉంది భారత జట్టు.. 53/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లాండ్‌ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది.