పుష్ప రిలీజ్ డేట్ ప్రకటించిన స్టైలిష్ స్టార్

వాస్తవం సినిమా: ఈ ఏడాది ఆగస్టు 13న పుష్ప రిలీజ్ కానుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న మూవీ పుష్ప రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న పుష్ప సినిమా విడుదల కాబోతోంది.

ఈ విషయాన్ని బన్నీ ట్విటర్ ద్వారా తెలిపాడు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి పుష్ప సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఏడాది మిమ్మల్నందరినీ థియేటర్లలో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌తో కలిసి మరోసారి మేజిక్ చేస్తానని ఆశిస్తున్నా అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.