తండ్రి చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులు జారీ చేసిన విజయ్..

వాస్తవం ప్రతినిధి:  విజయ్ ఇటీవలే మాస్టర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను సాధించాడు. అయితే కెరీర్ పరంగా దూసుకుపోతున్న విజయ్, కుటుంబం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా తన తండ్రితో అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తన తండ్రి చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులు జారీ చేసాడు విజయ్. తన తండ్రి రాజకీయ పార్టీ ప్రచారం నేపథ్యంలో తన ఫోటో కానీ తన పేరు కానీ వాడకూడదంటూ ఆ నోటీసులో పేర్కొన్నాడు విజయ్.

విజయ్ తండ్రి చంద్రశేఖర్ 2020 జులైలో అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం పేరుతో రాజకీయ పార్టీను రిజిస్టర్ చేయించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పోటీ చేస్తాడని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఈ విషయంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. తనకు పార్టీకు ఎలాంటి సంబంధం లేదని, తన అభిమానులు అర్ధం చేసుకోవాలని కోరాడు.