పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ

వాస్తవం ప్రతినిధి: పల్లె ప్రగతి – పంచసూత్రాల పేరిట పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.

పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు.

పల్లె ప్రగతి – పంచ సూత్రాలు..
-ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తాం
– భద్రత-ప్రశాంతతకు భరోసా కల్పిస్తాం
– ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం
– స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా..వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటాం
– ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తాం.. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామలు తీర్చిదిద్దటమే లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వైసీపీ చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వాటిని అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు.