హెచ్​4 వీసాదారులకు ఊరట..ట్రంప్​ ఉత్తర్వులను రద్దు చేసిన బైడెన్​ ప్రభుత్వం

వాస్తవం ప్రతినిధి: వలస విధానాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై పరిమితి పెట్టడం, అమెరికా పౌరసత్వం ఇచ్చే గ్రీన్ కార్డులపై తిరకాసులు పెట్టడం వంటివి చేశారు.

అంతేకాదు.. హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చే హెచ్4 వీసాలపైనా 2019 ఫిబ్రవరిలో ఆయన ఆంక్షలు పెట్టారు. వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉత్తర్వులు పాస్ చేశారు. అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత ఆ ఉత్తర్వులు ఇప్పుడు రద్దయిపోయాయి. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ట్రంప్ పాస్ చేసిన ఆ ఆదేశాలను నిలిపేశారు.

హెచ్4 డిపెండెంట్ స్పౌజెస్ ను ఉద్యోగార్హుల జాబితా నుంచి తీసేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బిజినెస్ పరిశీలించింది. బైడెన్ వచ్చాక వాటన్నింటినీ 60 రోజుల వరకు ఆపేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది హెచ్4 వీసాదారులకు లబ్ధి చేకూరనుంది.