ఎస్పీబి కి పద్మవిభూషణ్‌ రావడం పట్ల స్పందించిన చిరంజీవి

వాస్తవం సినిమా: 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలో మెగాఫ్యామిలీ పాల్గొంది. ఈ సందర్భంగా మెగా స్టార్‌ చిరంజీవి దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కి పద్మ విభూషన్ పురస్కారం రావడంపై స్పందించారు. దీనిపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. త‌న‌ ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆయ‌న చెప్పారు. ఆ అవార్డుకు ఆయన అర్హుడని అన్నారు.

బ్రాకెట్స్‌లో మ‌ర‌ణానంత‌రం వ‌చ్చిన ప‌ద్మ‌విభూష‌ణ్‌ అనే పదం ఉండడం మాత్రం త‌న‌ను చాలా బాధిస్తోంద‌ని తెలిపారు. ఆయన ప‌ద్మ‌విభూషణ్ అవార్డును వ్యక్తిగతంగా స్వీక‌రించి ఉంటారనే భావిస్తున్నానని అన్నారు.

కాగా, ఆడియో రూపంలో చిరంజీవి ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విస్తృతంగా ర‌క్త‌దానం చేయాల‌ని కోరారు. చిరంజీవి బ్ల‌డ్ బ్లాంక్‌లో ర‌క్త‌దానం చేస్తోన్న వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.