యువ క్రికెటర్లకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

వాస్తవం ప్రతినిధి: ఆనంద్ మహీంద్రా తాజాగా టీమిండియాలోని ఆరుగురు క్రికెటర్లకు అదరిపోయే బహుమతిని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్ ను సొంతం చేసుకోవటంలో కీలకంగా వ్యవహరించిన ఆరుగురు క్రికెటర్లకు తమ కంపెనీకి చెందిన సరికొత్త ఎస్ యూవీ థార్ ను బహుమతిగా ప్రకటించారు. టెస్టు సిరీస్ ను భారత జట్టు గెలుచుకోవటంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్.. వాషింగ్టన్ సుందర్.. నటరాజన్.. శుభమన్ గిల్.. నవ్ దీప్ సైనీ.. శార్దూల్ ఠాకూర్ లకు ఈ ఖరీదైన కారును బహుమతిగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ బహుమతి యువ క్రికెటర్లకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.