అసలు సిసలైన భారత మాత ముద్దు బిడ్డ నేతాజీ : మోడీ

వాస్తవం ప్రతినిధి: సుభాష్ చంద్రబోస్.. భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. అశేష భారతావని ప్రజల గుండెల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిలించినవాడు. హిందు ఫౌజ్ స్థాపించి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి చరమగీతం పాడాలని పాటు పడ్డవాడు. భారత ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడై వెలిగినవాడు. అందరూ ముద్దుగా నేతాజీ అని పిలుచుకునేవాడు. ఆయన పుట్టినరోజు నేడు. 1897 జనవరి 23వ తేదీన జన్మించిన సుభాష్ చంద్రబోస్, భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని భారత ప్రజల గుండెల్లో స్వేఛ్చని నింపాలని తపించినవాడు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ  నేడు నేతాజీకి నివాళి అర్పించారు. ‘నేతాజీ అతి గొప్ప దేశ సేవకుడు అంతకుమించిన స్వతంత్ర సమర యోధుడు. వీటన్నింటికి మించి అసలు సిసలైన భారత మాత ముద్దు బిడ్డ. అతడు చేసిన త్యాగాలను భారత దేశం ఎన్నటికీ మరువలేద’ని మోదీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దేశానికి చేసిన సేవ, దేశం కోసం చేసిన త్యాగాలకు చిహ్నంగా అతడి పుట్టిన రోజును పరాక్రమ దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన్నట్లు తెలిపారు.. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోదీ కోల్‌కతాలోని ఎల్జిన్ రోడ్‌లో ఉన్న నేతాజీ భవన్‌ను సందర్శించనున్నారు.