వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్…అన్నా రాంబాబుకు వార్నింగ్!

వాస్తవం ప్రతినిధి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇవాళ ఒంగోలులో వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.. రూ.8.5 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు.. పిల్లల చదవు బాధ్యతలను కూడా తీసుకున్నారు.. ఈ సందర్భంగా… వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేనాని..

ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. అన్నా రాంబాబూ గుర్తుంచుకో.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తాం అని హెచ్చరించారు. ‘జగన్ రెడ్డి గారూ మీ ఎమ్మెల్యే చేసిన పనికి ఆయనను శిక్షిస్తారా? అంత ధైర్యం మీకు ఉందా?’ అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులను కూడా వదలడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? లేక ఫ్యూడలిస్టు వ్యవస్థలో ఉన్నామా? అనే విషయాన్ని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.