తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం(టిటిఎ)కు నూతన కార్యవర్గ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ ఎన్నిక

వాస్తవం ప్రతినిధి: 2021-22సంవత్సరానికి గాను తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టిటిఎ) నూతన కార్యవర్గ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ ను ఆదివారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఎంపిక చేసింది.

తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం వ్యవస్థాపకులు డా” శ్రీ పైళ్ల మల్లారెడ్డి సమక్షంలో.. అడ్వైసరీ చైర్మన్ డా” విజయపాల్ రెడ్డి మరియు కో చైర్ డా” హరినాథ్ పొలిచెర్ల ఎన్నిక పత్రాన్ని విడుదల చేశారు.

నూతన కార్యవర్గ కమిటీలో అధ్యక్షులుగా డా” మోహన్ రెడ్డి పటలోళ్ళ, ఉపాధ్యక్షులుగా వంశీ రెడ్డి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా సురేష్ వెంకన్నగారి, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ మనప్రగడ, జాయింట్ సెక్రటరీగా కవిత రెడ్డి కంతాల, కోశాధికారిగా పవన్ రవ్వ, జాయింట్ కోశాధికారిగా హరిందర్, కార్యనిర్వాహక డైరెక్టర్ గా వెంకట్ గడ్డం, నేషనల్ కో ఆర్డినేటర్ గా వెంకట్ ఎక్క, ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా నవీన్ గోలి, మీడియా మరియు కమ్యూనికేషన్ డైరెక్టర్ గా డా” నరసింహరెడ్డి దొంతిరెడ్డి మరియు ఎథిక్స్ కమిటీ చైర్ గా మాధవి సోలేటి ఎన్నికయ్యారు.

అడ్వైసరి చైర్మన్ డా” విజయపాల్ రెడ్డి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యవర్గం తో పాటు 20 మందితో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సభ్యులను కూడా ఎన్నిక చేసి వారి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.