చరిత్రలో తొలిసారిగా 50వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడెప్పుడా అని మదుపరులు ఎదురుచూసిన ఘట్టం తాజాగా ఆవిష్కారం కావటమే కాదు..విశ్లేషకులు అంచనాల్ని నిజం చేస్తూ.. సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 50వేల పాయింట్లను ముద్దాడిన వైనం ఇప్పటికి..ఎప్పటికి ప్రత్యేకమనే చెప్పాలి.

2020 మార్చిలో కరోనా దెబ్బకు సెన్సెక్స్ 25వేల పాయింట్లకు పడిపోతే.. కేవలం పది నెలల వ్యవధిలోనే 50వేల మార్కును చేరుకోవటం చూస్తే.. ఆశ్చర్యంగా అనిపించక మానదు.

గురువారం సెన్సెన్స్ సూచీ 50వేల మార్కును దాటి.. కాసేపటికి తగ్గినప్పటికి.. 50కెను టచ్ చేయటం అపూర్వమని చెబుతున్నారు. 35 ఏళ్ల క్రితం మొదలైన చిన్న ప్రయాణం.. నేడు చరిత్రలో లిఖించదగ్గ రోజుగా మారింది. 50వేల మార్కును టచ్ చేసి.. ఆపైన మరికొంత దూసుకెళితే పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. అంతలోనే పడిపోవటం కాసింత నిరాశను కలిగించినా.. 50వేల మార్కు అందనంత ఏమీ కాదన్న విషయం తాజాగా స్పష్టమైందని చెప్పాలి.