వాస్తవం ప్రతినిధి: ఆస్టేలియాలో భారత క్రికెట్ టీమ్ సాధించిన చారిత్రక విజయం గురించి ప్రధాని నరేంద్ర వెూదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఎన్నో సవాళ్ల మధ్య అనుభవం లేని టీమిండియా చరిత్ర సృష్టించిందని, ఇండియా కూడా ఇలాంటి స్ఫూర్తితోనే ముందడుగు వేయాలని పిలుపు నిచ్చారు. అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి వెూదీ ఈ రోజు వర్చువల్ గా ప్రసంగించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశ పరిస్థితిని, అనుభవం లేని ఇండియన్ టీమ్ గెలిచిన తీరును పోలుస్తూ వెూదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మన క్రికెట్ టీమ్‌నే ఉదాహరణగా తీసుకోండి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. మనం దారుణంగా ఓడిపోయాం. అయినా కఠిన సవాళ్లను ఎదురిస్తూ మళ్లీ విజయం సాధించాం. వాళ్లకు అనుభవం లేదు. అయినా ఆత్మవిశ్వాసానికి మాత్రం కొదవ లేదు. చివరికి వాళ్లే చరిత్ర సృష్టించారు. క్రికెట్ సక్సెస్ మనకు పెద్ద జీవిత పాఠం అని మోడీ అన్నారు.