వాస్తవం ప్రతినిధి: ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆప్త (APTA) సంస్థాగత ఎన్నికల్లో విజయాన్ని సాధించిన నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించింది.
శ్రీ J.J.V. సుబ్రహ్మణ్యం అధ్యక్షుడిగా, శ్రీ ఈశ్వర్ అరిగే బోర్డ్ చైర్ గా 22 మంది సభ్యుల తో కూడిన బృందం ఆప్త సంస్థ నాయకత్వపు భాద్యతలను స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసారు.
ఆప్త అడ్వైసరీ కమిటి సభ్యులైన శ్రీ విజయ భాస్కర్ కొట్టె, తో కలిసి ఆప్త సంస్థ వ్యవ స్థాపకుల్లొ ఒకరైన శ్రీ ప్రసాద్ సమ్మెట నూతన నాయకత్వపు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారైన ఎన్నారై లచే 2008 లో స్థాపించబడి భారతదేశం లోని తెలుగు నేలపై నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల ప్రతిభావంతులైన పేద విద్యార్దులకు ఎందరికో చేయూతనందిస్తున్న సంస్థ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ APTA.
అలాగే అమెరికాలోని తెలుగు వారి బాగోగులకోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ తెలుగు వారికి అండదండగా నిలబడు తోంది ఆప్త సంస్థ. ఇది నిజంగా తెలుగు వారికి ఆప్తమిత్రులవంటి సంస్థ. ఈ సంస్థ గత 13 సంవత్సరాలుగా నిరంతర సేవలందిస్తూ అభివృద్ది పథంలో నడుస్తుంది అంటే అందుకు ముఖ్య కారణం ఇందులోని సేవా దృక్పథం కలిగిన నాయకత్వ వర్గం మాత్రమే.
నూతనంగా ఎన్నికైన 22 మంది సభ్యుల వివరాలు:
New Board Directors (2021-2022):
=======================
1. Sri Eswar Arige ( Board Chair)
2. Sri Prasad Thota ( Board Secretary)
3. Smt. Dr Neeraja Naidu Chavakula
4. Sri Gopala Gudapati
5. Sri Chandra Sekhar Nallam
6. Smt. Kousalya Tummala
7. Sri Siva Yarramsetty
8. Smt. Hima Bindu Naraharishetty
9. Sri Madhu Dasari
10. Sri Venkat Yanumula
Core Executive Team (2021-2022)
====================
President –Sri. JJV Subrahmanyam
Vice Presidents
1. Smt Dr. Chinny Naidu
2. Sri Trinadha Rao Mudrageda
3. Sri Ashok Galla
General Secretary
Sri. Lalit Kumar Vadlamudi
Joint Secretaries
1. Smt. Nageswari Thota
2. Sri Kiran Chandu
3. Sri. Nagu Kunasani
Treasurer
Sri. Anil Kumar Veerisetty
Joint Treasurers
1. Smt.Purnima Annangi
2. Sri.Gopal Nunna
3. Sri. Satya Balla