హార్దిక్ పాండ్యా ఇంట విషాదం

వాస్తవం ప్రతినిధి: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా క్రికెటర్‌కాగా.. ప్రస్తుతం అతను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలియగానే హుటాహుటిన అతను ఇంటికి పయనమయ్యాడు.