పరిణామంవాస్తవం ప్రతినిధి: గత ఏడాది చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇక మన దేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఈ ప్రాణాంత వైరస్ కారణంగా లక్షన్నర మంది ప్రాణాలు కొల్పొయారు. అయితే ఈ మహమ్మారి జయించడానికి చాలా దేశాలు టీకాలు కనుగొనే పనిలో పడ్డాయి. మరి కొన్ని దేశాలు వ్యాక్సిన్ కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో భారతలో ఇవాళ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను మోదీ ప్రారంభించారు.
ఈరోజు దేశంలో ప్రధానమంత్రి వెూదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్వెూహన్రెడ్డిలు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సందర్భంగా ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. . ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 26 వేల మంది పబ్లిక్, పైవేటు హెల్త్ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నామని వెల్లడించారు.