సంక్రాంతి సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

వాస్తవం సినిమా: డార్లింగ్ అంటూ అభిమానులు ముద్దుగ అపిలుచుకొనే ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత సాహోతో అందరిని అలరించిన ప్రబాస్. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీని తరువాత కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా చేయనున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో రానున్న సినిమాకు సలార్ పేరును ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌, విలన్ పాత్రధారులను వెతకడం కష్టం అయిపోయింది. ప్రభాస్ స్థాయికి తగ్గా హీరోయిన్, విలన్ అంటే బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో చాలా అరుదుగా ఉన్నారు. దాంతో ఈ పాత్రల కోసం నటులను వెతకడం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది. అయితే సలార్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.

అయితే.. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిర్మాణ సంస్థ అదిరిపోయే అప్డేట్‌ అందించింది. సలార్‌ మూవీ షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. రేపు అనగా 15న ఉదయం 11 గంటలకు సలార్‌ మూవీ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌తో పాటు తెలుగు, కన్నడ సిని పరిశ్రమలకు చెందిన పలవురు ప్రముఖులు హాజరుకానున్నారు.