భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలి: చిరంజీవి

వాస్తవం సినిమా: సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా తెలుగు పలువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సినీనటుడు చిరంజీవి ట్వీట్ చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌ని నాగార్జున చెప్పారు.

‘మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరినీ దేవుడు చల్లగా చూడాలి’ అంటూ విక్ట‌రీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘భోగ భాగ్యాల‌నిచ్చే భోగి, స‌ర‌దానిచ్చే సంక్రాంతి, క‌మ్మ‌ని క‌నుమ‌, కొత్త ఏడాది కొత్త వెలుగులు నింపాల‌ని కోరుకుంటూ ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు’ అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.

‘మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాధ్యతగా. క్షేమంగా ఉండాలి’ అని మహేశ్ బాబు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాన‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.