రాష్ట్రప్రభుత్వం అప్పులు అందువల్లే పెరిగాయంటున్న బొత్స సత్యనారాయణ

వాస్తవం ప్రతినిధి: ఏపీ లో రికార్డు స్థాయిలో 20 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అప్పుల్ని తీసుకొచ్చినట్లుగా కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో.. రాష్ట్రం మీద మొత్తం అప్పుల భారం రూ.3.73లక్షల కోట్లు కావటం గమనార్హం. ఇంతలా అప్పులు చేయటం.. రాష్ట్రానికి మంచిది కాదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. అప్పుల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా చెప్పేస్తున్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.

రాష్ట్రప్రభుత్వం అప్పులు చేస్తున్నదంతా అభివృద్ధి కోసమే కదా.. అవినీతికి పాల్పడేందుకు కాదు కదా?అన్న ఆయన ప్రజా సంక్షేమం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చటం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోందన్నారు.

ప్రజా శ్రేయస్సు కోసమే అనేక కార్యక్రమాల్ని చేపడుతున్నామని.. అందువల్లే అప్పులు పెరిగాయన్న ఆయన.. ఇది సహజ పరిణామంగా చెప్పేయటం ఆసక్తికరంగా మారింది. విపరీతంగా పన్నుల భారాన్ని ప్రజలపై మమోపుతున్నారంటూ ఏపీ విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోందని.. వైద్య.. విద్యా రంగంలో సమూల మార్పుల్ని తెచ్చుందన్నారు.