గేదెకు లేని బాధ గుంజకెందుకో ?: విజ‌య‌సాయిరెడ్డి

వాస్తవం ప్ర్తినిధి: ఏపీ ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ, మాజీ సీఎం చంద్ర‌బాబు‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. గేదెకు లేని బాధ గుంజకెందుకో అన్నట్టుగా నిమ్మగడ్డ వ్యవహారముందంటూ ఎద్దేవా చేశారు.

కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉండ‌టంతో ఎన్నికల విధులు నిర్వహించలేమని ఉద్యోగులు మొరపెట్టుకున్నా .. నిమ్మ‌గ‌డ్డ ససేమిరా అన్నారని విమ‌ర్శించారు. అయితే చివరకు న్యాయం గెలిచిందని అన్నారు.

కరోనా భయంతో ముక్కుకి గుడ్డ కట్టుకొని పెద్ద/చిన్న నాయుడు హైదరాబాద్‌లో దాక్కున్నారంటూ చంద్ర‌బాబు, లోకేష్‌పై ప‌రోక్షంగా సెటైర్ వేశారు. 60-100 ఏళ్ల వృద్ధులు కూడా పంచాయితీ ఎన్నికల్లో ఓటేయాలని అంటున్నారన్న విజ‌య‌సాయి.. టీడీపీ బతకదని తెలుసు కాబట్టి ఏపీ ప్రజలు ఏమైనా పర్వాలేదనుకుంటున్నారని విమ‌ర్శించారు. వీళ్లు మనుషులా, రాక్షసులా అంటూ మండిప‌డ్డారు.