ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ..

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఒక దాని తరువాత ఒకటిగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా యూట్యూబ్ ఆయన ఖాతాను బ్లాక్ చేసింది. ఇప్పటికే షేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి ఖాతాలను తాత్కాలికంగా ఆయా సంస్థలు బ్లాక్ చేసిన సంగతి విదితమే. అలాగే ట్వీట్టర్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసింది. తాజాగా యూట్యూబ్ కూడా ట్రంప్ ఖాతాను నిలిపివేసింది. ట్రంప్ యూట్యూబ్ లో తాజాగా అప్ లోడ్ చేసిన కంటెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని యూట్యూబ్ పేర్కొంది.