సింగర్ సునీత వివాహంపై నాగబాబు ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు ..!

వాస్తవం సినిమా: మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనితో సింగ‌ర్ సునీత వివాహం ఇటీవ‌ల‌ జరిగిన విష‌యం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో వీరి వివాహం జ‌రిగింది. ఈ సందర్భంగా సునీతకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. తాజాగా, సినీన‌టుడు నాగ‌బాబు వారి పెళ్లిపై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
”సంతోషం అనేది పుట్టుకతో ఉండదు. రాదు. దాన్ని మనం వెతుక్కోవాలి. రామ్ – సునీతలు ఇద్దరూ కూడా తమ సంతోషాలను కనుగొన్నందుకు కంగ్రాట్స్. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేసే వారికి.. కొన్నింటిని ఎంచుకునేందుకు సిగ్గుపడేవారికి ఉదాహరణగా మీ జంట నిలిచింది.. ప్రేమ సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్ గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అని నాగబాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇంతకముందు సినీ విమర్శకుడు కత్తి మహేష్ సైతం సునీత పెళ్లిని ట్రోల్ చేస్తున్న వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.