చిలుక తో చరణ్.. ఫొటోస్ వైరల్

వాస్తవం సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదికూడా సోలోగా ఉన్న పిక్ కాదు. రామ్ చరణ్ తన భుజాలమీద ఒక గెస్ట్ కి చోటిచ్చాడు. ఈ ఫోటోలో రామ్ చరణ్ తన కోర మీసాలతో నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. తన భుజాల మీద రామచిలుక వాలడంతో చరణ్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. చూస్తుంటే తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని అనిపిస్తుంది. మొత్తానికి చిలుకతో చరణ్ ఆడుకున్న తీరు మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ త్వరలోనే తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.