సంక్రాంతి సందర్భంగా ‘విరాటపర్వం’ పోస్టర్ విడుదల

వాస్తవం సినిమా: మావోయిస్టు ఉద్యమం నేపథ్యంలో.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. రానా మావోయిస్టుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.

గతంలో రానా జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పుడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా నేడు మరో పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది.

మావోయిస్టు యూనిఫామ్ లో వున్న రానా చేయిని పట్టుకున్న సాయిపల్లవి.. ఇద్దరూ ఆనందంతో నవ్వుతూ.. నడుచుకుంటూ వస్తున్న ఫొటోతో కూడిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

సినిమా థియేటర్లలో సందడి చేసేది ఎప్పుడని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలపై మేకర్స్ స్పందించారు. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాతో అభిమానుల అంచనాలను అందుకుందో లేదో వేచి చూడాల్సిందే.