ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎం లు

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘ఈ భోగి మంట‌ల్లో అన్ని అరిష్టాలు అంతం కావాల‌ని.. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు భోగ‌భాగ్యాల‌తో, ఆయురారోగ్యాల‌తో విల‌సిల్లాల‌ని ఆకాంక్షిస్తున్నాను’ అని చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గన్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’ అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ప్ర‌జ‌ల‌కు బీజేపీ నేత సునీల్ దేవధర్ కూడా భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు.