వాస్తవం ప్రతినిధి: ప్రముఖ నటుడు సోనూ సూద్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. పలు అంశాలపై వీరిద్దరు చర్చించారు. ఐతే శరద్ పవార్‌ను సోనూసూద్ ఎందుకు కలిశాడన్న దానిపై అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ఫ్యాన్స్ కూడా రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఐతే కేవలం మర్యాదపూర్వకంగానే శరద్ పవార్‌ను సోనూ సూద్ కలిసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.