భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కవిత

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి సంబరాలు వేడుకగా జరిగాయి. చార్మినార్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.

ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

భోగి అంటేనే మన జీవితాల్లో ఉన్న చెడు అంత భోగి మంటల్లో కాలి పోవాలని జరుపుకుంటామన్నారు. గత ఏడాదంతా కరోనా ఇబ్బందులు పడ్డాం, ఆ చెడు అంతా భోగి మంటల్లో కాలి పోవాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలందరు కరోనా మహమ్మారి నుండి విముక్తి పొందాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది మంచి ఆరంభం కావాలని సంక్రాంతి అంటేనే సిరిసంపదలు ఇచ్చే పండగ..అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని ఆకాంక్షిస్తున్నాని కవిత అన్నారు.