ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ భోగి శుభాకాంక్ష‌లు

వాస్తవం ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ.. ట్వీట్‌ను కూడా తెలుగులోనే చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అంటూ ట్విట్‌లో చెప్పుకొచ్చారు. గ‌తంలో కూడా ప‌లు సంద‌ర్భాల్లో నాలుగైదు సార్లు, తెలుగులో ట్వీట్ చేశారు మోదీ.