ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్ నియామకం

వాస్తవం ప్రతినిధి: ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌‌ను ఆర్టీసీ ఎండీగా నియమించింది.