తిరుమలలో జనవరి 15నుండి శ్రీవారి సుప్రభాత సేవ పునఃప్రారంభం

వాస్తవం ప్రతినిధి: ధనుర్మాసం సందర్భంగా 2020 డిసెంబర్ 16 నుంచి శ్రీవారికి సుప్రభావత సేవ ఆగిపోయింది. ధనుర్మాసం జనవరి 14తో ముగుస్తుంది. అందువల్ల జనవరి 15న శ్రీవారికి తిరిగి సుప్రభాత సేవను ప్రారంభించబోతోంది తితిదే.

తిరిగి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు మొదలవుతాయి. 14న ధనుర్మాస ఘడియలు ముగియనుండటంతో 15 తెల్లవారుజామునుంచి సుప్రభాతంతో స్వామి వారిని నిద్రలేపుతారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం వస్తున్న సమయంలో భక్తులను కూడా అనుమతిస్తారు. జనవరి 16న శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవం, గోదాపరిణయోత్సవాలను టీటీడీ జరపబోతోంది. సంక్రాంతి తర్వాత కనుమ రోజున ఇది జరపడం సంప్రదాయం.