పెళ్లికి నిరాకరించిన ప్రియుడు..కత్తితో పొడిచి చంపేసిన ప్రియురాలు

వాస్తవం ప్రతినిధి: పెళ్లికి నిరాకరించడంతో ప్రాణంగా ప్రేమించిన యువకుడిని అత్యంత దారుణంగా హరమార్చిందో ప్రియురాలు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డు మీద ఒక యువకుడిని పొడిచి చంపింది మరో యువతీ. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తాడేపల్లిగూడెంకి చెందిన తాతాజీ నాయుడు, పావని ఇద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సదరు యువతి యువకుడిని పెళ్లి చేసుకోమని కోరగా కొద్ది రోజుల క్రితం రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నాడు. అయితే పెద్దల సమక్షంలో కూడా పెళ్లి చేసుకోవాలని పావని చాలా రోజుల కోరుతూ వస్తోంది. కానీ ఆ విషయాన్ని తాతాజీ నాయుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. నిన్న రాత్రి మాట్లాడాలని పిలిచిన పావని చాలా సేపు బతిమాలడినా పెళ్లికి నిరాకరించడంతో అక్కడికక్కడే కత్తితో పొడిచి చంపేసింది. దీంతో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.