దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు: అభిమానులకు కోహ్లి ట్వీట్

వాస్తవం ప్రతినిధి: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ సోమవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. అనుష్క శర్మ ఈ మధ్యాహ్నం పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పాప, అనుష్క శర్మ ఇద్దరూ ఆరోగ్యం ఉన్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ సమయంలో దయ చేసి ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోహ్లీ ఫ్యాన్స్ ను కోరాడు .
విరాట్ దంపతులు పండంటి బేబికు జన్మనిచ్చిందని తెలిసిన అభిమానులు , సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక పాపని ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేస్తారని అందరు ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో కోహ్లి సోదరుడు వికాస్ .. పాప కాళ్ల ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ .. ఇంట్లోకి ఏంజెల్ వచ్చింది. పట్టరానంత సంతోషంగా ఉంది అని క్యాప్షన్ ఇచ్చారు. వికాస్ షేర్ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.