ఫాన్స్ కు గుడ్‌న్యూస్ చెప్పిన రాంచ‌ర‌ణ్

వాస్తవం సినిమా: టాలీవుడ్ న‌టుడు రాంచ‌ర‌ణ్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. తాను మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయించుకోగా క‌రోనా నెగెటివ్ గా నిర్దార‌ణ అయిన‌ట్టు తెలియ‌జేశాడు. నాకు కోవిడ్‌-19 నెగెటివ్ నిర్దార‌ణ అయిన విష‌యాన్ని మీతో పంచుకోవ‌డం ఆనందంగా ఉంది. మ‌ళ్లీ వ‌ర్క్ లో చేరేందుకు వేచి ఉండ‌లేక‌పోతున్నా..? మీ అంద‌రి మ‌ద్దతుకు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని ట్విట‌ర్ లో షేర్ చేశాడు.

రాంచ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. మ‌రోవైపు రాంచ‌ర‌ణ్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ-చిరంజీవి కాంబోలో తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రానికి డేట్స్ కేటాయించాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ఆచార్య షూటింగ్ లో చేర‌నున్న‌ట్టు టాక్‌. డిసెంబ‌ర్ లో రాంచ‌ర‌ణ్ తోపాటు వ‌రుణ్‌తేజ్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన విష‌యం తెలిసిందే. క‌రోనా నెగెటివ్ రావ‌డంతో వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టికే ఎఫ్ 3 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.