తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కోవిషీల్డ్‌ టీకా

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలకు వచ్చేశాయి. ఏ రాష్ట్రానికి ఎన్ని టీకాల్ని తొలి దశలో పంపాలన్న విషయంపై కేంద్రం లెక్క కట్టింది.

కొవిడ్‌ వ్యాక్సినేషన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలిదశ వ్యాక్సిన్‌ రవాణాలో భాగంగా కొవిషీల్డ్‌ టీకా డోసులు పుణె నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. అక్కడి నుంచి ప్రత్యేక బందోబస్తుతో గన్నవరంలోని కోల్డ్‌ స్టోరేజీలకు వ్యాక్సిన్‌ను తరలించారు అధికారులు.

తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ఆరోగ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన శీతలీకరణ కేంద్రానికి వ్యాక్సిన్ చేరుకుంది. పూణే ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వ్యాక్సిన్ ను తరలించారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మొత్తం 3.72 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇక్కడకు చేర్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ లో వాటిని నిల్వ చేశారు.