గవర్నర్‌ తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ

వాస్తవం ప్రతినిధి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌, సింగిల్ బెంచ్‌ ఉత్తర్వులు, డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌పై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై ఎస్‌ఈసీ డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇవాళ గవర్నర్‌ను నిమ్మగడ్డ కలవనున్నారు.