అదే లక్కీడేట్ ఫిక్స్..’ఆచార్య’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ!

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో నెవర్ బిఫోర్ అనేలా రెడీ అవుతున్నారు. ఆయన లైనప్ చూస్తేనే అర్ధమవుతోంది.. ఎలాంటి హిట్స్ అందుకోబోతున్నారో.

ఆచార్య మూవీలో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఓ కీ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ మూవీ రిలీజ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. లాక్డౌన్ తర్వాత ఆల్రెడీ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. సినిమాలు పడుతూనే ఉన్నయ్. ఇక ఆచార్య టీమ్ కూడా రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీకి వచ్చిందంట. సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మే 9న రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. ఎందుకంటే..

అప్పట్లో బంపర్ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది మే 9 నాడే. సో.. అదే లక్కీడేట్ ని ఫాలో అవుతున్నారు అని ఆ మధ్య న్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు కూడా అదే డేట్ పై ఫిక్స్ అయి ఉన్నారట. సినిమా కాస్త ముందే అయిపోయినప్పటికీ.. వెయిట్ చేస్తూ.. అప్పటి వరకూ మూవీకి మెరుగులు దిద్దుతూ.. మే 9న రిలీజ్ చేయాలనేది ఆచార్య మూవీ టీమ్ ప్లాన్ అట. సో.. మే 9న మెగా ఫ్యాన్స్ కి పండగే.